ఇళ్ల మధ్య నుండి వెళ్లిన గ్యాస్ పైపులైన్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. దూలపల్లి సాయినగర్‌లో శనివారం ఉదయం పైపులైన్ నుండి గ్యాస్ లీక్ కావడంతో మంటలు అంటుకున్నాయి. క్రమేణా మంటలు వ్యాపించి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మున్సిపల్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. మధ్యాహ్నం భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది మంటలు ఆర్పి మరమ్మతులు చేపట్టారు.