
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు శిక్షణా కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో కూడా పోలీసు ఉద్యోగాల కోసం 3 పూటల భోజనంతో కూడిన ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎంతో మంది ఉచిత శిక్షణ తీసుకుని ఉద్యోగాలు సంపాదించారన్నారు. నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.