కీసర గుట్ట అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పర్యాటకులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలకు ఎకరాల్లో ఉన్న నీలగిరి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే ఇది ఆకతాయిల పని అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కీసరగుట్ట అడవుల్లో భారీ అగ్నిప్రమాదం
-