
పటాన్ చెరువు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన మల్లేష్ కుమార్తె దుర్గాభవాని(21) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం ఇంటినే వద్ద ఉండగా శనివారం ఉదయం ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సురేందర్ రెడ్డి తెలిపారు