తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండగా ఎండిపోగా.. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడింది. ఈ క్రమంలో తెలంగాణకు వర్స సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. అంతేకాదు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అెలర్ట్ కూడా జారీ చేసింది. రాబోయే రెండు గంటలలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగర ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.