
కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ సరఫరాలో అదనపు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. అసలు ధర రూ.972 ఉండగా.. ఏదో ఒక కారణం చెప్పి రూ.1010 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో ఠంచనుగా సరఫరా చేస్తాడో లేదోననే భయంతో అడిగినంత ఇచ్చేస్తున్నామని అంటున్నారు. పట్టణంలో ఏ మూలకు సిలిండరు సరఫరా చేసినా ఈ కొసరు తప్పకుండా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు.