పాకిస్తాన్ సూపర్ లీగ్ పై కరోనా పడగ.. షాహిద్ అఫ్రిది పాజిటివ్‌

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్‌ మూడో వేవ్‌.. చాలా దేశాలకు పాకేసింది. పేద ధనిక అనే తేడానే లేకుండా ఈ మహమ్మారి అందరికీ సోకుతోంది. క్రీడా కారులు, వ్యాపార వేత్తలు, సినీ నటులు, రాజకీయ నాయకులు ఇలా ఎవ్వరినీ వదలడం లేదు. ఈ కరోనా మహమ్మారి వైరస్‌.

ఇక తాజాగా పాకిస్థాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రీదీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో షాహిద్‌ అఫ్రీదీ హోం ఐసోలేషన్‌ లోకి వెళ్లి పోయారు. ఈ విషయాన్ని PSL బృందం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2022 ప్రారంభ మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయగా.. ఆయనకు కరోనా సోకిందని వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.అఫ్రీదితో కాంట్రాక్ట్‌ లో ఉన్న వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పింది PSL బృందం.

Read more RELATED
Recommended to you

Latest news