ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. అతి తర్వగా ఆ ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు. మే నాటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని.. ఆధార్ సేవలను అందించడానికి అవరసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు.
సిటిజన్ సర్వీసెస్ పోర్టల ప్రారంభ కార్యక్రమం తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వలంటీర్లను సత్కరించి.. వారికి ప్రొత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. అలాగే ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి యూనిఫామ్స్ అందించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన జరుగాలని ఆదేశించారు.