
KNR: ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. కె. రామకృష్ణ తెలిపారు. మ్యాజిక్ బస్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే మేళాలో 15 కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపడుతాయన్నారు. 2018 నుంచి 2021 వరకు ఏదైనా డిగ్రీ, B TECH, MBAలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు విద్యార్హత ధ్రువపత్రాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు.