
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 14 ఏప్రిల్ 2022 నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి. మొదటి విడత సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో ప్రస్తుతం రెండో దశ యాత్ర మరింత సుదీర్ఘకాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. సంగ్రామ యాత్ర విధి విధానాలు, రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటించనున్నారు.