గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం క్లారిటీ.. ప్రోరోగ్ కానందునే గవర్నర్ ప్రసంగం లేదు- ప్రశాంత్ రెడ్డి

-

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ అంశంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడంతోనే గవర్నర్ ప్రసంగాన్ని పెట్టలేదని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాలకు ఇది కొనసాగింపు సమావేశాలే అని స్పష్టత ఇచ్చారు. రాజ్యంగం గురించి బీజేపీకి అవగాహన లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రోరోగ్ కానీ సభకు గవర్నర్ ని పిలిస్తే తప్పు అని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వం అయిన తాము చేసిన డెవలప్మెంట్ గురించి గవర్నర్ చేత చెప్పించుకోవాలని అనుకుంటుందని.. ఆ అవకాశాన్ని ఎవరూ పోగొట్టుకోరని ఆయన అన్నారు. సాంకేతిక సమస్యల వల్లే గవర్నర్ ప్రసంగం ఉండటం లేదని అన్నారు. గతంలోనూ గవర్నర్ ప్రసంగాలు లేకుండా సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. 

రాజ్యాంగంలో గవర్నర్ సమావేశాలను ప్రారంభించాలని ఎక్కడా లేదని ఆయన అన్నారు. రాజ్యాంగంపై అవగాహన లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగపై బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2004లో రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే.. పార్లమెంట్ సమావేశాలు జరగడాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసింది బీజేపీనే అని విమర్శించారు. పలు రాష్ట్రాల్లో మీకు మెజారిటీ రాకున్నా.. ఎమ్మెల్యేలను లోబరుచుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర మీదని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో దొంగతనంగా బీజేపీ పార్టీ రాత్రి పూట ప్రమాణ స్వీకారం చేయించుకున్నారని..గోవా, కర్ణాటకలో కూడా బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news