కరీంనగర్: ఇద్దరు వీఆర్ఏలపై దాడి

మానకొండూర్: గట్టుదుద్దెనపల్లిలో శనివారం అర్ధరాత్రి ఇద్దరు వీఆర్ఏలపై దాడి జరిగింది. గుట్ట నుంచి అక్రమంగా మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారనే సమాచారం మేరకు వీఆర్ఏలు జెట్టి శ్రీనివాస్, మంత్రి రాజు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లు వచ్చి వారిపై దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.