యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి

యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరోనా పీడ తెలంగాణను వీడాలని ఆయన కోరుకున్నట్టు తెలిపారు.