గత ఏడాది కరోనా సెకండ్ వేవ్ తో పాటు బ్లాక్ ఫంగస్ దేశ వ్యాప్యంగా అల్ల కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పుడు కరోనా కంటే.. బ్లాక్ వైరస్ కే ప్రజలు ఎక్కువగా భయాందోళన కు చెందారు. కాగ ఈ బ్లాక్ ఫంగస్ ఏడాది తర్వాత మరో సారి వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదు అయింది. సోమవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఒక వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు.
ప్రస్తుతం వస్తున్న కరోనా థర్డ్ వేవ్ లో ఇదే మొదటి బ్లాక్ ఫంగస్ కేసు అని అధికారిక వర్గాలు తెలిపాయి. యూపీ లోని కాంట్ అనే ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వయస్సు ఉన్న ఒక వ్యక్తికి బ్లాక్ ఫంస్ లక్షణాలు బయటకు వచ్చాయని తెలిపారు. అతన్ని పరీక్షించిగా.. అతని కన్ను తో పాటు ముక్కులో కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపించింది ఉందని వైద్యులు గుర్తించారు.
కరోనా సోకిందని అలాగే డయాబెటిస్ కూడా ఉందని వైద్యులు తెలిపారు. షుగర్ ఉండటం వల్లే.. బ్లాక్ ఫంగస్ వచ్చి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. కాగ కరోనా సోకిన వారు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం తో పాటు స్టెరాయడ్లను ఎక్కువ గా వాడకూండా జగ్రత్త పడాలని వైద్యులు సూచించారు.