‘ఇంకా 50 శాతమే’

కరీంనగర్: 15-17 ఏళ్ల వయస్సున్న వారికి టీకాలను వేసే విషయంలో జిల్లాలో ఇంకా 50 శాతాన్ని దాటిన ప్రగతి మాత్రమే కనిపించింది. ఈ నెల 3న ఈ ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటి వరకు 50 శాతాన్ని దాటేలా వ్యాక్సినేషన్ కొనసాగింది. జిల్లాలో ఈ వయస్సు కలిగిన వారు 50,908 మంది ఉండగా ఇప్పటి వరకు 25,816 మందికి టీకాలు వేసి 50. 71శాతం పురోగతిని చూపించారు.