పంజాబ్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 20న పంజాబ్ లో పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి 14 జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలంటూ పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు.
గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బనారస్ వెళ్లేందుకు వీలుగా.. దళిత వర్గాల ప్రతినిధులు ఎన్నికలను వేయాలని కోరాయి . ఈ వర్గానికి చెందిన వారు పంజాబ్ నుంచి 20 లక్షల మంది దాకా యూపీ, బనారస్ కు వెళ్తుంటారు. దాదాపు దళిత వర్గానికి చెందిన వారు పంజాబ్ లో 32 శాతం మంది ఉన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు జరిగే వేడుకులకు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దీంతో ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో పాటు… వారి మనోభావాలపు కూడా పరిగణలోకి తీసుకుని వాయిదా వేయాలని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు కోరాయి.