
నూతన మల్టీ జోనల్ విధానంలో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించింది. అయితే వేములవాడ రాజన్న జోన్‌లో మెదక్, సిద్దిపేట జిల్లాలు ఉంటాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా చార్మినార్ జోన్‌లో ఉంటుందని తెలిపారు. కాగా సమీపంలోని చార్మినార్ జోన్‌లో మెదక్‌ను కలపాలని ఇప్పటికే పలు సంఘాల నాయకులు డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం రాజన్న జోన్‌లోనే కలుపుతూ నిర్ణయం తీసుకుంది.