MLA ఇంట్లో అగ్నిప్రమాదం

-

కోరుట్ల నియోజకవర్గ MLA విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెట్ పల్లిలోని వారి నివాసంలో పిండిపదార్థాలు చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న MLA సతీమణి సరోజకు గాయాలవ్వగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీశ్రేణులు, అభిమానులు ఆందోళన చెందవద్దని, MLA కుమారుడు డాక్టర్ సంజయ్ సోషల్ మీడియా వేదికగా కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news