కరీంనగర్ : జగిత్యాల: 2 ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

మేడిపల్లి మండల కేంద్రంలో గురువారం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన రాజం అనే వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారని వివరించారు.