
కోరుట్ల పట్టణ శివారులోని జాతీయ రహదారిపై లారీ ఢీకొని మల్యాల మండలం రాజారామ్ గ్రామానికి చెందిన బోదాసు రఘు అనే యువకుడు మృతి చెందాడు. మోటార్ సైకిల్‌పై కోరుట్లకు వస్తుండగా, సాయిరామ దేవాలయం సమీపంలోని బ్రిడ్జి వద్ద లారీ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.