మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పట్టణంలోని సూర్య థియేటర్లో సందడి చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సినిమా విడుదల కాగా కుటుంబసభ్యులతో కలిసి సినిమాను వీక్షించారు. ఎమ్మెల్యే సినిమా చూడటానికి రావడంతో ప్రేక్షకులు ఈలలు అరుపులతో హంగామా చేశారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సీతామహలక్ష్మి, టీఆరెఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ : భీమ్లానాయక్ థియేటర్లో ఎమ్మెల్యే సందడి
-