ఉక్రెయిన్‌ క్రైసిస్‌ పై నాటో సంచలన ప్రకటన..రష్యాపై దాడి చేస్తాం !

-

ఉక్రెయిన్ దేశంపై ర‌ష్యా యుద్దం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ యుద్దాన్ని అప‌డానికి ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఐక్య రాజ్య స‌మితి కూడా యుద్దం నిలిపివేయాల‌ని ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరింది. అయినా ఫ‌లితం లేదు. ఉక్రెయిన్ ను నిరాయుధాంగా చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ స్ప‌ష్టం చేశారు.

అప్ప‌టి వ‌ర‌కు త‌మ సైనిక చ‌ర్య ఆగ‌ద‌ని కూడా తెల్చి చెప్పారు. ఇలాంటి తరుణంలో నాటో సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ దేశంలో రష్యా చేస్తున్న దాడి అప్రజాస్వామికమని నాటో పేర్కొంది. ఇప్పటికే రష్యాపై అనేక ఆంక్షలు విధించామని.. రష్యాపై తీవ్ర ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది నాటో.

రష్యా తన సైన్యాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని.. తమ మద్దతు ఉక్రెయిన్‌ కు పూర్తిగా ఉంటుందని చెప్పింది. రష్యా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని.. నాటో డిఫెన్స్‌ ఫోర్స్‌ సిద్దం చేస్తున్నామని వెల్లడించింది. అమెరికా కూడా తమ సైన్యాన్ని భాగస్వామ్యం చేసిందని.. 100 ఫైటర్‌ జెట్స్‌ సిద్దం చేశామని నాటో ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ ను ఆర్థికంగా, సైనిక పరంగా ఆదుకుంటామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news