
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్యలోనైనా, ఆదాయం పరంగానైనా సంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మరోవైపు ఫిబ్రవరి 1 నుండి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై కసరత్తు పూర్తి చేసింది. అందుకోసం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.