ఒపెన్ స్థలంలో అసభ్యకరంగా ప్రవర్థించిన కేసు నుంచి బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి భారీ ఊరట లభించింది. 2007 లో రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ ప్రచారం కార్యక్రమం సందర్భంగా హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరే… శిల్పాశెట్టిని వేదికపైనే కౌగిలించుకోవడం… ఆ తర్వాత వరుస ముద్దులు ఇవ్వడం తెలిసిందే.
ఆ సమయంలో శిల్పాశెట్టి వద్దంటున్నా గెరే రెచ్చి పోయి ఆ పని చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఇందులో సంబంధించి శిల్పాశెట్టి, రిచర్డ్ గెరేకు వ్యతిరేకంగా రెండు కేసులు నమోదు అయ్యాయి. అశ్లీలత, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అభియోగాలు మోపారు.
15 ఏళ్ల తర్వాత ఈ కేసులు కొలిక్కి వచ్చింది. తొలుత రాజస్థాన్ లో నమోదైన కేసులను శిల్పాశెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రోపాలిటన్ కోర్టుకు బదిలీ చేసేందుకు లోగడ సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ వివాదంలో శిల్పాశెట్టిని బాధితురాలిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేతకి చవాన్ అభివర్ణించారు. నాడు ఘటన జరిగిన వెంటనే శిల్పాశెట్టి దీనిపై స్పష్టత విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శిళ్పాశెట్టికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అభియోగాలు ఆధారరహితమని పేర్కొంటూ కొట్టి వేశారు.