గజ్వేల్: డ్రంకెన్‌ డ్రైవ్‌లో 15 మందికి జరిమానా

 

డ్రంకెన్‌ డ్రైవ్‌లో 15 మందికి రూ.30 వేల జరిమానా విధించినట్లు గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. 5 రోజుల క్రితం ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌, వీరన్న సిబ్బందితో కలసి గజ్వేల్‌ పట్టణంలోని ఆయా చౌరస్తాలలో డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహించగా 15 మంది పట్టుబడ్డారు. వారిని గజ్వేల్‌ కోర్టులో హాజరు పరచగా గజ్వేల్‌ ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ రూ.30 వేల జరిమానా విధించింది.