పటాన్ చెరువు బాలిక అదృశ్యం

పటాన్ చెరువు మండల పరిధిలోని భానుర్ గ్రామ సమీపంలోని ఓ కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలిక శుక్రవారం ఇంటినుండి వెళ్ళింది. రాత్రి గడిచినా ఇంటికి రాలేదు. బాలిక కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, బిడీఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు.