మెదక్ : హుస్నాబాద్: రెండు కార్లు ఢీ.. ముగ్గురికి గాయాలు

accident
accident

హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ కల్వర్టు వద్ద శుక్రవారం రాత్రి అదుపుతప్పి ప్రమాదవశాత్తు రెండు కార్లు ఢీకొన్నాయి. ముగ్గురికి గాయాలు కాగా సమయానికి స్థానికులు స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 లో హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్లియర్ చేసి, ఘటనపై ఎస్సై శ్రీధర్ దర్యాప్తు చేస్తున్నారు.