ఇండియాపై ఎలాన్‌ మస్క్‌ విమర్శలు..కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. రెండు రోజుల కిందట ఇండియా విమర్శలు చేస్తూ.. ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. భారత ప్రభుత్వంతో ఎదురు అవుతున్న సవాళ్ల కారణంగానే ఇండియలోకి టెస్లా రాక ఆలస్యం అఅవుతుందని కామెంట్‌ చేశారు ఎలాన్‌. దీనిపై పలువురు ఇప్పటికే మండిపడుతూ ట్వీట్‌ చేశారు.

తాజగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆ ట్వీట్‌ పై స్పందించారు. ఎలాన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌ ను కేటీఆర్‌ రీ ట్వీట్‌ చేశారు. ముందుగా భారత్‌ లో టెస్లా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌ కు ధన్యవాదాలన్నారు కేటీఆర్‌. భారత్‌ లేదా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రధానంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌ గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని పేర్కొన్నారు కేటీఆర్‌.