జాతీయ రహదారి పై ప్రమాదం

accident

జహీరాబాద్ నియోజకవర్గం మాద్రి ఎక్స్ రోడ్ 65వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం లారీ బోల్తా కొట్టింది. జహీరాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే కోహిర్ పోలీసులు, ఎల్ అండ్ టి సిబ్బంది ట్రాఫిక్ ను అదుపు చేసి క్రేన్ సహాయంతో వాహనాన్ని రోడ్డు నుంచి తొలగించారు.