మెదక్ : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోహీర్ మండలం కొత్తూర్  గ్రామ శివారులోని 65.వ. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్రగాయాలు కాగా భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.