సంగారెడ్డి నుంచి 40 మంది హెచ్ఎంల బదిలీ

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా నుంచే ఏకంగా 40 మంది హైస్కూల్ హెడ్​మాస్టర్​లను బదిలీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. జిల్లా నుంచి బహుళ జోనల్​2లో ఉన్న 40 మంది ప్రధానోపాధ్యాయులను మల్టీ జోన్​1కి కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చివరకు జిల్లాలో 98 మంది ప్రధానోపాధ్యాయులే మిగిలి ఉంటారు.