
ఘట్కేసర్ మండలం పరిధిలోని కొండాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి నరేష్ మృతదేహం నేడు లభ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు. గ్రామంలోని మంగళకుంట చెరువు దగ్గర ద్విచక్ర వాహనం, చెప్పులను గుర్తించిన కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్లు సహాయంతో పోలీసులు ముమ్మరంగా గాలించి వెలికితీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.