వికారాబాద్ పట్టణంలోని మహిళ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఎస్పి కోటిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌లో ఏవిధంగా చర్యలు తీసుకుంటున్నారని, పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.