రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ప్రేమ జంటపై.. యువతి మేనమామ గొడ్డలితో దాడి చేశాడు. దీంతో యవకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.