
బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గౌతంరెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరుకు తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులు కూడా నెల్లూరుకు వెళ్లారు. ఇవాళ సాయంత్రం అమెరికా నుంచి ఆయన కొడుకు రానున్నారు. రేపు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.