తెలుగులో ప్రధాన పత్రికలుగా చాలమణి అవుతున్న ఈనాడు, ఆంధ్ర జ్యోతి లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అసత్య కథనాలను ప్రచురిస్తున్న కారణంగా.. ఈ రెండు దిన పత్రికలపై పరువు నష్టం దావా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగ గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు వస్తున్నాయని, విద్యుత్ సరఫరాలలో అంతరాయం కలుగుతుందని ప్రజల్లో భయాందోళన పరిస్థితులు రేకిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి ప్రకటన ద్వారా తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నా.. దురుద్దేశ్య పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనే కుట్రతో ఈ రెండు పత్రికలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. విద్యుత్ సరఫర, కోతలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికి అప్పుడు ప్రకటనలు చేస్తున్నా.. ప్రజలను గందరగోళానికి గురి అయ్యేలా ఈ రెండు పత్రికలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. అలాంటి పత్రికల పై చట్ట పరంమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందుకే ఈనాడు, ఆంధ్ర జ్యోతి దిన పత్రికలపై పరువు నష్టం దావా వేయనున్నాట్టు తెలిపారు.