సూర్యాపేట: బూస్టర్ డోసు వేయించుకున్న ఎంపీ

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, కొవిడ్ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.