హుజురాబాద్ : మ‌ళ్లీ సీన్లోకి కౌశిక్ రెడ్డి..ఈ సారి కొట్తాడులే!

-

సరిగ్గా మూడు నెలల క్రితం తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఒక సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆధిపత్యానికి, ఆత్మగౌరవానికి వార్ అన్నట్లు జరిగింది. కేసీఆర్ అధికారానికి, ఈటల రాజేందర్ ఆత్మగౌరవం మధ్య యుద్ధం ఓ రేంజ్‌లో నడిచింది. అధికార బలంతో కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసిన హుజూరాబాద్ ప్రజలు మాత్రం ఈటల వైపే నిలబడిన విషయం తెలిసిందే. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలని ఒక మలుపు తిప్పింది.

అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలోనే అనేక మంది నేతలు తెలంగాణ పోలిటికల్ స్క్రీన్‌పై హల్చల్ చేశారు. అలా హల్చల్ చేసిన నేతల్లో కౌశిక్ రెడ్డి కూడా ఒకరు. ఇక కౌశిక్ రెడ్డి రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ నుంచి ఎలా బయటకొచ్చారు…టీఆర్ఎస్‌లో ఎలా చేరారు..హుజూరాబాద్ సీటు కోసం ఎలా ట్రై చేశారో అందరికీ తెలిసిందే. కానీ చివరి నిమిషంలో కౌశిక్‌కు సీటు దక్కని విషయం తెలిసిందే. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీటు దక్కింది. ఎన్నికల్లో గెల్లు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అంతటితో హుజూరాబాద్ ఉపఎన్నిక కథ ముగిసింది.

కానీ నెక్స్ట్ ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదు..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వచ్చేసేలా ఉన్నాయి. మరి అప్పుడు హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్ తరుపున ఎవరు బరిలో దిగుతారు? అంటే ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. అయితే మళ్ళీ సీటు కోసం కౌశిక్ రెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నారట. ఇప్పటినుంచే నియోజకవర్గ పరిధిలో యాక్టివ్‌గా తిరగడం మొదలుపెట్టేశారట. గెల్లు ఇంచార్జ్‌గా ఉన్నా సరే కౌశిక్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారని తెలిసింది.

ఎమ్మెల్సీ సీటు దక్కినా సరే నెక్స్ట్ మాత్రం హుజూరాబాద్ సీటుని దక్కించుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నారట. అందుకే హుజూరాబాద్‌లో సెపరేట్‌గా తన బలాన్ని పెంచుకుంటున్నట్లు తెలిసింది.  సీటు దక్కేవరకు కౌశిక్ తన ట్రైల్స్ ఆపేలా లేరు. మరి హుజూరాబాద్ సీటు ఈసారైనా దక్కుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news