నల్గొండ: ఇంటర్ విద్యార్థి మృతి

crime
crime

డెంగ్యూ జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం చౌటుప్పల్ మండలంలోని జేకేసారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జేకే సారంలో దొడ్డి బీరప్ప, కమలమ్మ దంపతుల కుమారుడు కార్తీక్ (17) ఇంటర్ చదువుతున్నాడు. గత వారం రోజుల నుంచి జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.