కీసరగుట్టలో మార్చి 1న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, ఈఓ సుధాకర్‌రెడ్డి, ట్రస్టుబోర్డు సభ్యులు శుక్రవారం కలెక్టర్ హరీష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ… కోఆర్డినేషన్ మొదటి సమావేశాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.