మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై జరిగిన హత్య కుట్రను ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం భద్రంగా ఉందని, రాష్ట్రాన్ని కొన్ని దుష్టశక్తులు, దుర్మార్గులు అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు.