ఉమ్మడి నల్గొండ జిల్లాలో బుధవారం 24 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నల్లగొండ జిల్లాలో 7 కరోనా కేసులు, సూర్యాపేట జిల్లాలో 2 కరోనా కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో 15 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కచ్చితంగా మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించాలని కోరారు.