భువనగిరిలో నెమలి మృతి

భువనగిరి మండలంలోని మన్నెవారిపంపులో నెమలి మృతి చెందింది.‌ గ్రామంలోని చిన్నవాగు సమీపంలో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఇటీవల వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు చేశారు. పొలంలో కలుపు‌ నివారణకు మందు చల్లి ఉంటారని తెలిపారు.ఈ క్రమంలో పోలంలో నీటిని తాగేందుకు‌ వచ్చి నెమిలి మృతి చెంది ఉండవచ్చని రైతులు తెలిపారు. విషయాన్ని రైతులు అటవీశాఖ అధికారులు సమాచారం అందజేశారు.