యాదాద్రి: క్షేత్రంలో నిత్య నరసింహ హోమం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రంలో నిత్య సుదర్శన నరసింహ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం ఉదయం స్వామివారి నిజాభిషేకం అనంతరం శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని లోక కళ్యాణం కాంక్షించి, సుదర్శన నరసింహ, ఆళ్వార్ లను కొలుస్తూ వేదమంత్రాలతో పూర్ణాహుతి చేశారు. సర్వ పాప నివారణ మైన హోమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.