భద్రాచలంలో భారీగా ట్రాఫిక్ జామ్..!

-

సందర్భంగా భద్రాచలం లో అభిజిత్ సముహూర్తమున రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో భద్రాచలం రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు మూడు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ తో సారాపాక గోదావరి బ్రిడ్జీ నుంచి కూనవరం రోడ్డులోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ దాకా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే బ్రిడ్జీ సెంటర్, బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్, జూనియర్ కాలేజ్ గ్రౌండ్ సెంటర్ దగ్గర అన్ని వైపులా వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు కిలోమీటర్ల మేరకు ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news