శిశువును విక్రయించిన కేసులో ఐదుగురు ముఠా సభ్యులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాహీన్‌నగర్ చెందిన నజ్మా బేగం నెలరోజుల తన కుమారుడుని దళారీ మహమ్మద్ ఖాన్‌తో కలిసి కుత్బుల్లాపూర్‌కు చెందిన సల్మాబేగంకు రూ.2.50 లక్షలకు అమ్మెశారు. అనంతరం మరికొంత డబ్బు అడిగారు. వారు ఇవ్వకపోవడంతో తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ నజ్మాబేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం బయట పెట్టారు.