రామగుండం బి పవర్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామగుండంకు చెందిన కారు మెకానిక్ షేక్ అజారోద్దీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం.. రామగుండం నుంచి ద్విచక్రవాహనంపై NTPC వైపు వెళ్తుండగా.. ఆటో ట్రాలీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.