పటాన్చెరు సీతారామ కాలనీలో తుపాకితో బెదిరింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యోగేష్ కుమార్ అనే వ్యక్తి గత నెల 28న రహదారిపై నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తుండగా కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అతను అధికారులను తుపాకితో బెదిరించారు. యోగేష్ కుమార్ ను అరెస్ట్ చేసి రివాల్వర్‌తో పాటు 14 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
MEDAK: సంగారెడ్డి: అధికారులనే తుపాకితో బెదిరించాడు.. చివరికి
By Network
-