
ఈనెల 19 నుంచి నిర్వహించే బీడీఎస్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్డులు కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. కరోనా నేపథ్యంలో తరగతులు సైతం సరిగా జరగలేదని, ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి పరీక్షలు వాయిదా వేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు.