రంగారెడ్డి : ప్రేమ పేరుతో మోసం

-

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎండీ వాహుత్‌దిన్ తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అనిల్ అనే యువకుడు బాలానగర్ వినాయక్ నగర్లో నివసిస్తున్నాడు. అక్కడ ఓ యువతి పరిచయం కావడంతో ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే మొహం చాటేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news